Select Location
All Locations
State
Region
City / District
ఒంటినిండా గాయాలతో మెడలో రుద్రాక్ష: జగదీష్ ‘మటన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

ఒంటినిండా గాయాలతో మెడలో రుద్రాక్ష: జగదీష్ ‘మటన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

‘పుష్ప’ చిత్రంలో కేశవ పాత్ర ద్వారా నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న జగదీష్.. లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న సినిమా ‘మటన్’. హర్షా డైస్ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నాడు. తాజాగా జగదీష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో బండారి పాత్రలో తాను కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ఒంటినిండా గాయాలతో మెడలో రుద్రాక్షలతో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో త్రిశూలాలు కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మనస్వి, రాజేష్ కన్నా, రమేష్ మాదాసు, కిరీటి రాజ్ ముస్సి, రవివర్మ ఉప్పలపాటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


V6 News 1 hour ago
Home Flash News