Select Location
All Locations
State
Region
City / District
ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చైనా సహాయం!

ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చైనా సహాయం!

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌లో తాము ఎలాంటి పాత్ర పోషించ లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన చైనా తొలిసారిగా నిజం ఒప్పుకుంది. పాక్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్టు చైనా తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (ఏవీఐసీ)కి చెందిన చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంజనీర్ల ఇంటర్వ్యూను ప్రభుత్వ వార్తా సంస్థ సీసీటీవీ ప్రసారం చేసింది.

అందులో నాలుగు రోజుల పాటు భారత్‌-పాక్‌ మధ్య జరిగిన యుద్ధంలో తాము పాకిస్థాన్‌ అధికారులతో కలిసి పనిచేసినట్టు జాంగ్‌ అనే ఇంజినీర్‌ తెలిపారు. ఆయన ప్రకటనతో చైనాకు చెందిన నిపుణులు నేరుగా పాక్‌లో ఉండి భారత్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న విషయం వెల్లడైంది.


Smacy News 4 days ago
Home Flash News