Select Location
All Locations
State
Region
City / District
LIVE
సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా

సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా

న్యూఢిల్లీ, మే 24: ఈ నెల 28న జరగాల్సిన ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) యూజీ- 2026’ పరీక్ష వాయిదా పడింది. ఆ రోజు రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయి దా వేస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. బక్రీద్‌ సెలవు తేదీలో వచ్చిన మార్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌టీఏ పేర్కొన్నది.

బక్రీద్‌ సెలవు తేదీలో మార్పునకు సంబంధించి కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పరీక్ష కొత్త తేదీలను ఎన్‌టీఏ, సీయూఈటీ వెబ్‌సైట్స్‌ ద్వారా తెలియజేస్తామని, అభ్యర్థులు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీలు సహా ప్రఖ్యాత వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.


Smacy News 48 minutes ago
Home Flash News