Rahul Gandhi | సీబీఎస్‌ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు.. జ్యుడీషియల్ విచారణ జరిపించాల్సిందే: రాహుల్ గాంధీ
Rahul Gandhi : సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో జరిగిన తప్పులపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది విద్యార్థులకు తప్పుడు మార్కులు రావడం సంచలనం కలిగించింది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. సీబీఎస్‌ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషీయిల్ విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.
సీబీఎస్‌ఈ ఫలితాల్లో జరిగిన తప్పులు, అవకతవకలపై దేశంలోని పిల్లలు, వారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారని రాహుల్ అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి జవాబుదారీ తనం లేదని విమర్శించారు. సీబీఎస్‌ఈ ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషియల్ విచారణ జరిపించడంతోపాటు వేగంగా విచారణ పూర్తయ్యేందుకు ఒక సిట్ ఏర్పాటు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల్ని మూల్యాంకనం చేసిన ‘సీవోఈఎంపీటీ’ సంస్థపై కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. గతంలొ ఈ సంస్థ తెలంగాణలో గ్లోబ్ ఎరేనా పేరుతో పరీక్షల్ని మూల్యాంకనం చేసింది.