Select Location
All Locations
State
Region
City / District
బీసీ గురుకుల బ్యాక్‌‌లాగ్ సీట్ల ఫలితాలు రిలీజ్...జూన్ 05 నుంచి సీట్ల కేటాయింపు

బీసీ గురుకుల బ్యాక్‌‌లాగ్ సీట్ల ఫలితాలు రిలీజ్...జూన్ 05 నుంచి సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8 , 9 తరగతుల బ్యాక్‌‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను రిలీజ్ చేసినట్టు ఇన్‌‌చార్జ్ సెక్రటరీ మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌‌లాగ్ సీట్ల కోసం ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్లు తమ ఫలితాలను సొసైటీ అధికారిక వెబ్‌‌సైట్ https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home , https://mjptbcwreis.telangana.gov.in లో చూసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు.

ఎంట్రన్స్‌‌లో మెరిట్ సాధించిన స్టూడెంట్లకు సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందుతుందని చెప్పారు. ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బీసీ గురుకుల ఇంటర్ కోర్సుల్లో ఫస్ట్ లిస్ట్‌‌లో సీట్లు వచ్చిన విద్యార్థులు గురువారంలోగా రిపోర్ట్ చేయాలని సూచించారు.


V6 News 1 hour ago
Home Flash News