Select Location
All Locations
State
Region
City / District
డీకేకు అసమ్మతి సెగ

డీకేకు అసమ్మతి సెగ

కొద్ది రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌కు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ప్రారంభమైంది. ఇటీవలే తనకు కేటాయించిన శాఖ నచ్చలేదంటూ రామలింగా రెడ్డి అనే మంత్రి పదవికి రాజీనామా చేయగా, ఆయన బాటలోనే మరో మంత్రి ఉండగా, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఒక మైనారిటీ నేత పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్దే తేల్చుకుంటామంటూ ఇద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు.

తనకు కేటాయించిన బెంగళూరు అభివృద్ధి శాఖపై అసంతృప్తిగా ఉన్న కృష్ణ బైరె గౌడ అధికారికంగా ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. అలాగే మంత్రి పదవిని కోరుతున్న ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ తనకు మంతి పదవిని ఇవ్వాలని కోరేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ పరిణామాలు చూస్తే తాజా మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో అసంతృప్తి కొనసాగుతున్నట్టు రామలింగారెడ్డి, కృష్ణ బైరె గౌడ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. మంత్రి పదవులు ఆశించి రానివారు, కోరుకున్న శాఖ లభించని వారు కూడా డీకేపై అసంతృప్తితో ఉన్నారు.


Smacy News 2 hours ago
Home Flash News