South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

దేశంలో అస్థిర‌త‌కు భార‌త భ‌ద్ర‌తా స‌ల‌హాదారే కార‌ణం.. మ‌ళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్‌..!

దేశంలో అస్థిర‌త‌కు భార‌త భ‌ద్ర‌తా స‌ల‌హాదారే కార‌ణం.. మ‌ళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్‌..!

IND vs PAK : భారతదేశ‌ ప్రత్యర్థుల కుయుక్తులను ముందుగానే గుర్తించి వాటికి చెక్ పెట్టడంలో భార‌త జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు (National Security Adviser) అజిత్ దోవ‌ల్‌ (Ajit Doval) దిట్ట. అందుకే ఆయన వ్యూహాలు పాకిస్థాన్ (Pakistan) కు నిద్రలేకుండా చేస్తుంటాయి. ఈ అసహనమంతా పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సలహాదారు, రిటైర్డ్‌ లెఫ్టినెంట్ జనరల్ మజహర్ జమీల్ (Mazahar Jameel) నోట బయటపడింది. కొన్ని రోజుల క్రితం లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌ (IISS) లో ఆయన మాట్లాడిన మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

పాకిస్థాన్‌లో అశాంతిని సృష్టించడానికి భారత్‌ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వాడుతోందని జమీల్‌ ఆరోపించారు. టీటీపీ, బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం అందులో భాగమేనంటూ చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో అస్థిరతను సృష్టించడానికి భార‌త్ అజిత్‌ డోభాల్ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందన్నారు. 1971లో ముక్తి వాహిని, 1980ల్లో ఎల్‌టీటీఈకి భారత్ మద్దతు ఇచ్చిందని తన ప్రసంగంలో నోరు పారేసుకున్నారు. 2001 నుంచి 2014 మధ్య అఫ్గాన్‌-పాకిస్థాన్‌కు మధ్య ఉన్న సరిహద్దు సమీపంలో భారత్ ఆరు కాన్సులేట్లు నడిపిందని ఆరోపించారు.

ఇవన్నీ ఉగ్రవాదానికి భారత్‌ మద్దతు ఇస్తుందనడానికి నిదర్శనమంటూ జ‌మీల్‌ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో అణు, సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణులను భారత్‌ ఉపయోగించిందని ఆరోపించారు. భారత్ అనుసరిస్తున్న ‘నో ఫస్ట్ యూజ్‌’ విధానం ఒక దౌత్యపరమైన వ్యూహం మాత్రమేనని, మొదటిసారే దాడి చేసేలా భారత్ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని మరో చిత్రమైన వాదన వినిపించారు. పాక్‌లోని అంతర్గత అస్థిరతలను ఎలా కట్టడి చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. ఆ నెపాన్ని భారత్‌పై నెట్టేయడమే ఈ ప్రసంగం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తున్న‌ది.

ఆపరేషన్ సింధూర్‌ సమయంలో దక్షిణాసియా మొత్తాన్ని భారత్ అణు విపత్తు అంచు వరకు తీసుకెళ్లిందని, అయితే పాకిస్థాన్ వ్యూహాత్మక సంయమనం వల్లే పరిస్థితి చక్కబడిందని జమీల్‌ సొంత డబ్బా కొట్టుకున్నారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం కింద భారత్‌కు ఉన్న మినహాయింపులను తొలగించాలన్న లక్ష్యంతో ఈ ఆరోపణలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

📍 Chennai
📰 Smacy News
🕒 7 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు హ‌ర్దీప్ సింగ్ పురి
మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు హ‌ర్దీప్ సింగ్ పురి
⬅ Back
➕ Post Ad
To Ads ➡