South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి

ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి

వడోదర: ప్రతికా రావల్‌ (100 నాటౌట్‌) అజేయ శతకానికి తోడు తెలుగమ్మాయి శ్రీచరణి (4/23) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో సత్తా చాటడంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత మహిళల క్రికెట్‌ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. షఫాలీ వర్మ (33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్‌) కూడా దంచికొట్టడంతో జింబాబ్వే ఇచ్చిన 198 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 27.1 ఓవర్లలో ఒకే వికెట్‌ కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (32)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ప్రతికా ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా గ్రౌండ్‌ షాట్లతో హోరెత్తించింది.

తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించిన తర్వాత మంధాన ఔటవగా.. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన షఫాలీ టీ20 స్టయిల్లో విజృంభించింది. భారీ షాట్ల తో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో టార్గెట్‌ ఇట్టే కరిగిపోయింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఆతిథ్య బౌలర్ల దెబ్బకు 49.5 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన చేశారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణితో వరుస వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచింది. క్రాంతి గౌడ్‌ (3/42), దీప్తి శర్మ (2/44) కూడా రాణించారు. జింబాబ్వే బ్యాటర్లలో బెలోవెడ్‌ బిజా (62) అర్ధశతకంతో పోరాడింది. ప్రతికాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. రెండో వన్డే ఆదివారం జరగనుంది.

📍 Chennai
📰 Smacy News
🕒 6 days ago

Related News

భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
⬅ Back
➕ Post Ad
To Ads ➡