South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

2.12 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోళ్లు

2.12 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోళ్లు

న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో దేశ రక్షణ రంగ బలోపేతం కోసం రూ. 2.12 లక్షల కోట్ల విలువైన సైనిక హార్డ్‌వేర్‌ కొనుగోళ్లకు అధికారికంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా త్రివిధ దళాల అవసరాలకు తగినట్లుగా అత్యాధునిక ఆయుధాలు, సైనిక ప్లాట్‌ఫామ్‌లు సమకూర్చనున్నారు. ఈ మొత్తం కొనుగోళ్లలో సుమారు 82 శాతం దేశీయ పరిశ్రమల నుంచి సేకరించనున్నారు.

ఈ ప్రతిపాదనల ప్రకారం భారత సైన్యం కోసం లైట్‌ మల్టీ రోల్‌ హెలికాప్టర్లు, లాంగ్‌ రేంజ్‌ కామికాజ్‌ డ్రోన్స్‌ సిస్టమ్స్‌, హై మొబిలిటీ వెహికిల్స్‌ మొదలైనవి సమకూర్చనున్నారు. భారత నావికా దళం కోసం యాక్టివ్‌ ఆఫ్‌ బోర్డ్‌ డికాయ్‌ సిస్టమ్‌, భారత వాయుసేనకు నూతన హెలికాప్టర్లు కొనుగోలు చేయనున్నారు .

📍 Chennai
📰 Smacy News
🕒 3 days ago

Related News

ఎక్కడైనా రెబల్స్‌ ఉంటే సస్పెండ్‌ చేయండి: సీఎం చంద్రబాబు
ఎక్కడైనా రెబల్స్‌ ఉంటే సస్పెండ్‌ చేయండి: సీఎం చంద్రబాబు
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
Today's Motivation
Today's Motivation
⬅ Back
➕ Post Ad
To Ads ➡