South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం.. గ్లోబల్‌ సమ్మిట్‌ పేరిట ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో విందులు, వినోదాలు!

కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం.. గ్లోబల్‌ సమ్మిట్‌ పేరిట ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో విందులు, వినోదాలు!

Revanth Reddy | హైదరాబాద్‌, అక్టోబర్‌ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో విందు, వినోదాల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలొస్తున్నాయి. రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు పైసా లేదంటున్న ప్రభుత్వం.. విందులకు మాత్రం రూ.వందల కోట్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వస్తాయో రాని పెట్టుబడుల కోసం గ్లోబల్‌ సమ్మిట్‌ పేరిట విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరువు కాలంలో రాష్ర్టాన్ని, రైతాంగాన్ని గాలికొదిలేసి గ్లోబల్‌ సమ్మిట్‌ పేరుతో విచ్చలవిడితనం చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

పెట్టుబడుల కోసమంటూ డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కర్టన్‌ రైజర్‌ ఈవెంట్ల పేరిట పెద్ద పెద్ద హోటళ్లలో వేడుకలు నిర్వహిస్తున్నది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రక్ష ఎక్స్‌పో పేరిట, తాజాగా గురువారం ఢిల్లీలో మరో పెద్ద హోటల్‌ తాజ్‌ ప్యాలెస్‌లో కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించడం గమనార్హం. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ, అతిథుల విడిది, విందు కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేశారనే విమర్శలున్నాయి.

వాస్తవానికి ఒకవైపు డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు నేరుగా గ్లోబల్‌ సమ్మిట్‌కే వస్తారు. వారిని గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని పిలిచేందుకు పెద్ద పెద్ద హోటళ్లలో భారీ ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, నిధుల కొరత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆడంబరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ దుబారా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పంట నష్టానికి పైసల్లేవ్‌… విందులకు మాత్రం వందల కోట్లు
కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో వ్యవసాయం ఆగమైంది. పంటలు ఎండిపోయి రైతులు భారీగా నష్టపోతున్నారు. పరిహారం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం నయా పైసా పరిహారం ప్రకటించలేదు. కనీసం రైతులకు భరోసా కూడా ఇవ్వడంలేదు. రైతులకు పంట నష్ట పరిహారం ఊసెత్తని సర్కార్‌.. రూ.వందల కోట్లు ఖర్చు చేస్తూ ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో గ్లోబల్‌ సమ్మిట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.

📍 Wanaparthy
📰 Smacy News
🕒 10 hrs ago

Related News

భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
⬅ Back
➕ Post Ad
To Ads ➡