South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఎన్నికలను ‘అరబ్ పార్టీలు’ కొల్లగొట్టాయి..: నెతన్యాహు

ఎన్నికలను ‘అరబ్ పార్టీలు’ కొల్లగొట్టాయి..: నెతన్యాహు

ఇంటర్నెట్‌ డెస్క్: ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి అరబ్‌ పార్టీలపై ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయని, అరబ్ పార్టీలకు అనుకూలంగా ఓటర్లకు లంచాలు ఇచ్చాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సెంట్రల్‌ ఎలక్షన్స్‌ కమిటీ (సీఈసీ) చీఫ్‌ కోరిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఈ వ్యవహారాన్ని పెను భూకంపంగా పేర్కొన్న ఆయన.. దీనిపై పోలీసులు, దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థలు తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

‘‘యునైటెడ్ అరబ్ లిస్ట్, జాయింట్‌ లిస్ట్‌ కూటములు (Arab Parties) ఎన్నికలను కొల్లగొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో (Israel Elections) విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంటును స్వాధీనం చేసుకోవడం, మితవాద పాలనను అంతం చేయడమే వాటి లక్ష్యం. ఒకవేళ అటువంటి ప్రభుత్వం ఏర్పడితే దేశానికే ప్రమాదం. ఇరాన్‌ విషయంలో ఇజ్రాయెల్ బలగాలు వెనకడుగు వేయడానికి దారితీయొచ్చు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏ జియోనిస్ట్ పార్టీ కూడా ఆ రెండు కూటములకు సహకరించకూడదు’’ అని నెతన్యాహు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

దాడులు జరగొచ్చు.. సిద్ధంగా ఉండండి: అమెరికా హెచ్చరిక..!
ఇజ్రాయెల్‌లో ఏ పార్టీకీ మెజారిటీ దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రాథమిక కౌంటింగ్‌ అంచనాల ప్రకారం.. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ 53 సీట్లు, మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్‌ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీ 48 సీట్లను గెలుచుకునే అవకాశముంది. అరబ్‌ పార్టీలకు 19 సీట్లు దక్కుతాయని అంచనా. 120 సీట్లు ఉన్న పార్లమెంటు నెస్సెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 సీట్లు ఉండాలి.

📍 Hyderabad
📰 Eenadu Telugu
🕒 10 hrs ago

Related News

భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
⬅ Back
➕ Post Ad
To Ads ➡