పీఎం కిసాన్ నిధుల విడుదల
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత కింద దేశవ్యాప్తంగా రైతులకు రూ. 19,000 కోట్లు విడుదల చేశారు. అలాగే గుజరాత్‌లో రూ. 14,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
బనస్కాంత జిల్లాలో 127 ఎకరాల్లో నిర్మించిన పశు సంతతి పరిశోధన కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అహ్మదాబాద్ మెట్రో విస్తరణ పనులను ప్రారంభించారు.