South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు

మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల (Andhra Pradesh Municipal Elections) పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఓటు వేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి వచ్చి ఓటు వేశారు. విజయవాడలో కూటమి మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధా, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు వేశారు. విశాఖపట్నంలోని ఎన్‌.టి.కాలేజ్‌ పోలింగ్‌ కేంద్రంలో కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 1 day ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
ఇరాన్‌పై పేజర్‌ ఆపరేషన్‌ తరహా దాడి!
ఇరాన్‌పై పేజర్‌ ఆపరేషన్‌ తరహా దాడి!
⬅ Back
➕ Post Ad
To Ads ➡