South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమపై ఏ విధంగా, ఏ స్థాయి దాడికి పాల్పడినా అందుకు దీటైన సమాధానం ఇవ్వాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తన సేనలకు పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే ఆ దేశ అణు సామర్థ్యాన్ని చాలా వరకు ధ్వంసం చేశాం. ఇంకా మరో రెండు టార్గెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మేం తలచుకుంటే 10 నిమిషాల్లో ఆ అణు శక్తిని పూర్తిగా అంతం చేయగలం. మా లక్ష్యాలలో పికాక్స్‌ పర్వతం (Pickaxe Mountain) కూడా ఉంది. అయితే టెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఆ దేశ నాయకులను నేను ఎప్పటికీ నమ్మలేను. మేం ఎప్పుడు దాడులు చేయబోతున్నాం అని ప్రతిఒక్కరూ తెలివి తక్కువగా అడుగుతున్నారు. నేడు దాడులు చేయాలని అనుకుంటే.. అందరికీ చెప్పి చేస్తానా?’ అని ట్రంప్ ప్రశ్నించారు.

పికాక్స్‌ పర్వతం..
ఇరాన్‌ (Iran)లోని కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) అని పిలుస్తారు. ఇది జాగ్రాస్ పర్వత శ్రేణిలో.. నతాంజ్ అణు కేంద్రానికి (Natanz nuclear complex) రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్‌ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఇక్కడికి తరలించి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు గతంలో అంచనా వేశాయి. ఈ కేంద్రంలో ఇప్పటికీ అణు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అమెరికా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే పికాక్స్ పర్వతాన్ని లక్ష్యం చేసుకుంటామని ట్రంప్ కొంత కాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ స్థావరంపై అగ్రరాజ్యం దాడులు చేస్తే.. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని ఇరాన్‌ హెచ్చరిస్తోంది.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 1 day ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
ఇరాన్‌పై పేజర్‌ ఆపరేషన్‌ తరహా దాడి!
ఇరాన్‌పై పేజర్‌ ఆపరేషన్‌ తరహా దాడి!
⬅ Back
➕ Post Ad
To Ads ➡