Republic Day: రిపబ్లిక్ డేలో ‘సిందూర్’ స్పెషల్.. సైనిక సత్తాను చాటిన పరేడ్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలు (Republic Day) మన సైనిక బలగాల సత్తాను చాటాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన ఈ వేడుకల పరేడ్‌లో ‘ఆపరేషన్ సిందూర్’లో వాడిన పలు స్వదేశీ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారి ‘బ్యాటిల్ అరే ఫార్మాట్’లో మన సైన్యం ఈ కవాతు (Republic Day Parade)లో పాల్గొంది. అంటే యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్నట్లుగా మన ఆయుధాలు, నిఘా వ్యవస్థలు, బలగాలను ఈ పరేడ్‌లో ప్రదర్శించారు.