ఓటీటీలోకి ‘తన్వి ది గ్రేట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇంటర్నెట్ డెస్క్: అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తన్వి ది గ్రేట్’ (Tanvi The Great). గతేడాది విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా అందుబాటులోకి వచ్చింది. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా రూపొందిన చిత్రం ఈ సినిమాలో (Tanvi The Great) శుభాంగిదత్ ప్రధాన పాత్ర పోషించారు.
2002లో వచ్చిన ‘ఓం జై జగదీష్’ సినిమా తర్వాత అనుపమ్ మళ్లీ ‘తన్వి ది గ్రేట్’కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. విడుదలకు ముందు ఈ సినిమాను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమె కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీన్ని వీక్షించిన అనంతరం ఆమె చిత్రబృందాన్ని అభినందించారు.