ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో కలర్ ఫుల్ జోష్..
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో మంగళవారం హోలీ వేడుకలు అంబురాన్నంటాయి. మంగళవారం ఉదయం నుంచి చిన్నారులు, పెద్దలు, యువత హోలీ వేడుకల్లో మునిగితేలారు. రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో పలు ఆలయాలు మూతపడగా, హోలీ వేడుకలు సైతం బుధవారం జరుపుకోవాలని పలువురు పండితులు సూచించినా, ప్రజలు మంగళవారమే సంబురాలు చేసుకున్నారు.
ములుగులోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మహబూబాబాద్జిల్లా పోలీస్ హెడ్ క్వార్ట్స్లో ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో పోలీసులు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో బీరప్ప నగర్ లో నిర్వహించిన సంబురాల్లో సీడబ్ల్యూసీ చైర్మన్ నాగవాణి, పట్టణ మహిళలు పాల్గొన్నారు- వెలుగు, నెట్వర్క్