Ugadi 2026: ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం! అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?
2026 మార్చి 19 న ఉగాది. ఈ రోజు నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతోంది. తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాల ( ప్రభవ నుంచి అక్షయ వరకు) చక్రంలో పరాభవ నామ సంవత్సరం 40వది. పరాభవ అంటే సంస్కృతంలో ఓటమి, పతనం, అవమానం లేదా పరాజయం అని అర్థం. కొన్ని జ్యోతిష్యశాస్త్ర గ్రంధాల్లో ఈ సంవత్సరం ప్రజలు ఒకరినొకరు అవమానించుకోలడం, ఓటములు ఎదుర్కోవడం, ధననష్టం, నైతిక పతనాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అందుకే ఈ పేరు వినగానే అంటే అన్నీ పరాభావాలేనా అని ఆందోళన చెందుతున్నారు కొందరు..అసలు ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారన్నది మరికొందరి సందేహం.
జ్యోతిష్య శాస్త్రంలో 60 సంవత్సరాల చక్రం ( బృహస్పతి గ్రహం ఒక్కో రాశిని దాటడం ఆధారంగా) ప్రకృతి, మనిషి స్వభావం, సమాజంలో వచ్చే మార్పులు సూచించేందుకు ఈ పేర్లు ఇచ్చారు. ఈ పేర్లు కేవలం ప్రతికూల ప్రభావం చూపిస్తాయని కాదు..ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు ( తీపి, చేదు, పులుపు, కారం, తీపి, ఉప్పు) లా జీవితంలోనూ ప్రతికూలత, అనుకూలత రెండూ ఉంటాయని అర్థం. అంటే జీవితంలో సుఖాలే కాదు దుఃఖాలు , సవాళ్లు కూడా ఉంటాయని గుర్తుచేసేందుకే ఈ పేర్లు వచ్చాయ్. 60 ఏళ్ల సంవత్సర చక్రం బాల్యం నుంచి వృద్యాప్యం వరకూ మనిషి జీవితి చక్రాన్ని పోలిఉంటుందని చెబుతారు పండితులు. 60 ఏళ్లు నిండిన తర్వాత మనిషి మళ్లీ కొత్తగా జన్మించినట్టే. అందుకే వృద్ధులను - చిన్నపిల్లలను ఒకేలా భావించాలంటారు
పురాణాల ప్రకారం నారదుడి సంతానం పేర్లు ఈ 60 సంవత్సరాలు ముఖ్య ఉద్దేశం మాత్రం సమాజానికి ముందస్తు హెచ్చరిక ఇవ్వడం జ్యోతిష్య శాస్త్రంలో కూడా పరాభవ నామ సంవత్సరాన్ని పరిణామం, మార్పు , కొత్త ప్రారంభాలకు సూచనగా చూస్తారు అహంకారం ఉన్నవారికి ఓటమి తప్పదు..వినయంగా ఉంటే మీ జీవితంలో మీరే ఊహించనంత అద్భుతమైన మార్పులు వస్తాయి కేవలం సంవత్సరం పేరు వల్లే ఫలితాలు ఆధారపడి ఉండవు..ఇది ఓ సూచన మాత్రమే. కర్మ, ప్రయత్నం, భక్తి, ధర్మం ఆధారంగా ఫలితాలు మారుతాయి. ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు జీవితంలో ఉంటాయనే సూచన.
ఈ ఏడాది మార్చి 19 గురువారం ఉగాది..కొత్త సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి, మీ కలలు నెరేవాలని ABP దేశం ఆకాంక్షిస్తోంది... మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు