... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.

మెదక్‌: వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పెద్దరెడ్డిపేట వద్ద పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు, రాయిపహాడ్‌ వద్ద స్లూయి్‌సవాల్స్‌ రిపేర్లు, సివిల్‌ పనులు, సంపులు శుభ్రపరచడం తదితర నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తిచేయడం కోసం సింగూరు(Singoor) నుంచి జిల్లాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.

మెదక్‌ నియోజకర్గంలోని 275 నివాస ప్రాంతాలు, మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీలు, అందోల్‌ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, టేక్మాల్‌ మండలాల్లోని 80 నివాస ప్రాంతాల పరిధిలో నేడు, రేపు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వేసవి నిర్వహణ పనుల కోసం చేపడుతున్న ఈ పనులను గుర్తించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Source : Smacy News

2 hours ago

Home Flash News