అసెంబ్లీ లాబీలో వైకాపా ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం
అమరావతి: శాసన మండలిలో వాయిదా తీర్మానంపై అసెంబ్లీ లాబీలో వైకాపా ఎమ్మెల్సీల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మండలికి ఆలస్యంగా వచ్చిన వరుదు కల్యాణిపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పేరుతో వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు సభలో ఉండాల్సిన పనిలేదా అని కల్యాణిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. తీర్మానం ఇచ్చినవాళ్లు సభలో లేకుంటే ఎలాగంటూ ఛైర్మన్ అడిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై కొంత గట్టిగానే స్పందించిన వరుదు కల్యాణి.. తన పేరిట వాయిదా తీర్మానం ఇస్తున్నట్లు సమాచారం ఎందుకు ఇవ్వలేదని లేళ్ల అప్పిరెడ్డిని ప్రశ్నించారు.