... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు..

వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు..

యశ్వంతపూర్‌-కాచిగూడ-యశ్వంతపూర్‌, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు(అనంతపురం): యశ్వంతపూర్‌-కాచిగూడ-యశ్వంతపూర్‌, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల(Vande Bharat Express trains) వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. యశ్వంతపూర్‌-కాచిగూడ (20704) ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్న తేదీ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బదులుగా 3.55 గంటలకు హిందూపురం స్టేషన్‌కు వస్తుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 20705) మధ్యాహ్నం 12.08 గంటలకు బదులుదేరి 12.17 గంటలకు హిందూపురం(Hindupur) వస్తుందని వివరించారు.

కలబురగి-బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం. 22231) రైలు 15వ తేదీ నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు బదులు 11.13 గంటలకు, యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 12.28 గంటలకు బదులు 12.30 గంటలకు చేరుతుందన్నారు. బెంగళూరు-కలబురగి వందే భారత్‌ రైలు (నం. 22232) యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 3.05 గంటలకు బదులు 3.09 గంటలకు వస్తుందని, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.23 గంటలకు బదులుగా సాయంత్రం 4.45 గంటలకు వస్తుందని తెలియజేశారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News