Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
India vs England, 2nd Semi-Final: టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుకు టీమిండియా భారీ టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగులు చేసింది.
Highest Team Total in T20 World Cup: 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 253 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరో ఓపెనర్ అభిషేక్ విఫలమైనా సంజూ శాంసన్ 89 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. శివమ్ దూబే, తిలక్ వర్మ, పాండ్యాలు తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోరు చేసి ఇంగ్లాండ్ కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చింది.
భారత్ అత్యధిక స్కోరు రికార్డు
టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2012 వరల్డ్ కప్‌లో పటిష్ట ఆస్ట్రేలియాపై 205 పరుగులు చేసింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో 200 కంటే ఎక్కువ స్కోరు సాధించిన జట్లు భారత్, వెస్టిండీస్ మాత్రమే.
విరాట్ సరసన శాంసన్
ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ, భారత జట్టు రన్-రేట్ తగ్గకుండా సంజు శాంసన్ మరోసారి బాధ్యత తీసుకున్నాడు. శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ వరుసగా రెండో మ్యాచులో శతకం చేజారింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా సంజూ శాంసన్ శామ్సన్, విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో శాంసన్‌కు ఇది వరుసగా రెండో అర్ధశతకం.