... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఎల్పీజీ కొరతపై పార్లమెంటు వద్ద ప్రతిపక్ష ఎంపీల నిరసన : మల్లు రవి, వంశీకృష్ణ

ఎల్పీజీ కొరతపై పార్లమెంటు వద్ద ప్రతిపక్ష ఎంపీల నిరసన : మల్లు రవి, వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఏర్పడిన ఎల్‌‌‌‌పీజీ (వంట గ్యాస్) కొరతపై కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండైన ఎంపీలు పార్లమెంటు ‘మక ర ద్వారం’ వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 4 రోజుల క్రితం వరకు ‘‘గ్యాస్ కొరత లేదు”అని చెప్పి, ఇప్పుడు ‘‘కొరత ఉంది’’ అని ప్రభుత్వం మాట మార్చడాన్ని తప్పుబడుతూ ప్రధాని మోదీ కటౌట్లను ప్రదర్శించారు.

ఈ ఆందోళనలో ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘నామ్ నరేందర్ – కామ్ సరెండర్’’(పేరు నరేందర్, చేసే పని లొంగిపోవడం) అంటూ ప్రధానిని ఉద్దేశించి చేసిన నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే సామాన్యులపై గ్యాస్ భారం పడుతున్నదని, అంతర్జాతీయ పరిణామాలను సాకుగా చూపి ప్రజలను వంచిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీలు విమర్శించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News