... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
సంపద సృష్టికి అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి: చంద్రబాబు

సంపద సృష్టికి అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి: చంద్రబాబు

అమరావతి: నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. పెట్టుబడులు, వైద్యం, సూపర్‌ సిక్స్‌- సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు.

‘‘ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సంపద సృష్టించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఎలా ఉన్నామో జిల్లాల వారీగా వివరాలు ఉండాలి. గత వైకాపా హయాంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితి అందరం చూశాం. వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. లేదంటే వ్యర్థమే’’ అని చంద్రబాబు అన్నారు. మధ్యాహ్నం నుంచి శాంతిభద్రతల అంశంపై సీఎం సమీక్షించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు డీజీపీ, జిల్లాల ఎస్పీలు హాజరుకానున్నారు.

Source : Eenadu Telugu

2 hours ago

Home Flash News