... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
శశికళ కొత్త పార్టీ.. పేరు ఇదే

శశికళ కొత్త పార్టీ.. పేరు ఇదే

ఇంటర్నెట్‌‌డెస్క్‌: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ (VK Sasikala) తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. దాని పేరు ‘ఆల్‌ ఇండియా పురచ్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ అని వెల్లడించారు. కొబ్బరి చెట్ల సమూహాన్ని పార్టీ గుర్తుగా ప్రకటించారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. తమ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుందని, గుర్తు ఐక్యతకు చిహ్నమన్నారు.

ఇటీవల కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. జయలలిత మరణం తర్వాత పార్టీలో సమస్యలు తలెత్తాయని, తాను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు మౌనంగా ఉన్నానని, ఇకపై ఉండటం కుదరదని, ఇంకా మౌనంగా ఉంటే కార్యకర్తలకు, ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News