గ్లోబల్ సమ్మిట్తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు: గవర్నర్ శుక్లా
అభివృద్ధిలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మారుస్తామన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. సోమవారం (మార్చి 16) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగం చదివిన గవర్నర్.. తెలంగాణను రైజింగ్ 47 దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.