... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
దారి మధ్యలో మహిళ.. వెనుకే నిలబడ్డ రోబో.. చివరకు..

దారి మధ్యలో మహిళ.. వెనుకే నిలబడ్డ రోబో.. చివరకు..

చైనాలోని మకావు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పటానె ప్రాంతంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు పక్కన దుకాణాల వద్ద ఓ మహిళ నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె గుండె గుబేల్‌మనే సంఘటన చోటు చేసుకుంది..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చైనాలోని (China) మకావు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పటానె ప్రాంతంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు పక్కన దుకాణాల వద్ద ఓ మహిళ నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె గుండె గుబేల్‌మనే సంఘటన చోటు చేసుకుంది. ఓ హ్యూమనాయిడ్ రోబో (Humanoid robot) సడన్‌గా వచ్చి ఆమె వెనుకే నిలబడింది. అప్పటిదాకా ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ.. అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూసింది. మహిళను చూడగానే ఆ రోబో చేతులు పైకి ఎత్తి వింతగా ప్రవర్తించింది. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ఆ వెంటనే తేరుకుని రోబోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ చాలా వరకు రోబోలే చేసేస్తున్నాయి. కొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఈ రోబోల కారణంగా అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, చైనాలో చోటు చేసుకున్న ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రోడ్డుపై నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. అదే సమయంలో ఓ రోబో.. ఆమె వెనుకే నిలబడి ఉంది. చివరకు ఏం జరిగిందంటే..

సదరు మహిళ ఆ రోబోతో చాలాసేపు వాదిస్తూ మండిపడింది. ఆ సమయంలో రోబో మాత్రం చేతులు పైకి కిందకు ఊపుతూ, అటూ ఇటూ కదులుతూ అక్కడే నిలబడింది. రోబో చేష్టలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న రోబో ఆపరేటర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సదరు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ఎలాంటి హానీ జరగలేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పోలీసులు ఆ రోబోను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం సదరు ఆపరేటర్‌కు అప్పగించారు. బహిరంగ ప్రదేశాల్లో రోబోలను వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించి పంపించారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఆ రోబోట్ మకావు అనే ప్రాంతంలోని ఓ విద్యా కేంద్రానికి సంబంధించినదని తెలుస్తోంది. ఈ రోబో చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన అధునాతన మోడల్ అని తెలిసింది. ఆ విద్యా కేంద్రం నిర్వాహకులు.. నగరంలో ప్రచారం కోసం ఈ రోబోను వినియోగిస్తున్నారు. ఆ విద్యా కేంద్రం అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోబో రిమోట్ నియంత్రణలో నడుస్తోంది. 2024 మేలో తయారైన ఈ రోబోకు దారిలో అడ్డంకులను తప్పించుకుని వెళ్లే సామర్థ్యం కూడా ఉంది. అయితే మార్గ మధ్యలో మహిళ ఉండడంతో ఆ రోబో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయిందట. మహిళకు కలిగిన అసౌకర్యంపై సదరు రోబో ఆపరేటర్ క్షమాపణలు తెలియజేశారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News