మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మా ప్రమేయం లేదు: సీఎం రేవంత్
దిల్లీ: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పందించారు. దీనిలో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ వేశాం’’ అని చెప్పారు. 2029లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సీఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను రేవంత్‌రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని రాహుల్, ప్రియాంకలకు రేవంత్ పరిచయం చేశారు.