... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఆర్‌సీబీ టికెట్‌ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ

ఆర్‌సీబీ టికెట్‌ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ

బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ను ఇచ్చింది. టికెట్‌ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్‌ కోడ్‌ సైతం లభించనుంది.

ఈసారి ఆర్‌సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్‌లైన్‌ టికెట్‌లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్‌సైట్‌ లేదా, యాప్‌ ద్వారా టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్‌ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్‌సైట్‌లకు గాని వ్యక్తులకు కాని టికెట్‌ అమ్మకాల హక్కులు లేవు.

2026వ సంవత్సర ఐపీఎల్‌ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్‌ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్‌ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌ రైసర్స్‌ హైదరాబాద్‌ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది.

Source : Sakshi

1 hour ago

Home Flash News