... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
అమెరికాకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు : తెగేసి చెప్పిన రష్యా

అమెరికాకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు : తెగేసి చెప్పిన రష్యా

అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో రష్యా ఎవరి వైపు.? ఇరాన్ వైపేనని ఎవరైనా సింపుల్ గా సమాధానం చెప్తారు. కానీ తమ చిరకాల బంధాన్ని కాదని అమెరికాకు మద్ధతిచ్చేందుకు రష్యా ముందుకు వచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ సంచలన రిపోర్ట్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ పై యుద్ధంలో అమెరికాకు సాయం చేస్తామని.. కానీ తమ శరతును అంగీకరిస్తేనేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్లు రిపోర్టులో పేర్కొంది. అయితే ఈ రిపోర్టు ఫేక్ అని రష్యా కొట్టిపారేసింది.

యూఎస్ మీడియా పొలిటికోలో రిపోర్ట్ గురించి ఈ విధంగా ఉంది. రష్యా దౌత్యవేత్త, పుతిన్ సహచరుడు కిరిల్ దిమిత్రియేవ్ అమెరికాకు ఒక ప్రతిపాదన పెట్టారు. అమెరికా ఉక్రెయిన్ తో సాంకేతిక సంబంధాలను తెంచుకుంటే.. ఇరాన్ కు ఇంటెలిజెన్స్ సహకారం అందించడం ఆపేస్తాం అంటూ.. యూఎస్ దౌత్యవేత్తలు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్ తో జరిగిన సమావేశంలో ఆఫర్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇదంతా తప్పుడు సమాచారం అని.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లుగా రష్యా కిరిల్ తిమిత్రియేవ్ ప్రకటించారు. ఇదంతా ఫేక్ అని ఒక్క మాటలో తేల్చేశారు రష్యా దౌత్యవేత్త.

అంతకు ముందే ఇరాన్ తో తమకున్న అనుంబంధాన్ని వెల్లడిస్తూ రష్యా అధ్యక్షుడు సందేశం ఇచ్చారు. ఇరాన్ నూతన సంవత్సరం, పర్షియల్ కొత్త ఏడాది అయిన నౌరూజ్ సందర్భంగా.. ఇరాన్ దేశ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు చెప్పారు. శుభాకాంక్షలతోపాటు పుతిన్ ఇచ్చిన సందేశం.. ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేశాయి.

టెహ్రాన్ కు మాస్కో దవిశ్వసనీయమైన మిత్రుడు. నమ్మకమైన భాగస్వామి అంటూ కామెంట్ చేయటం సంచలనంగా మారింది. మామూలు రోజుల్లో ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయేది. ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది.

ఈ క్రమంలోనే ఇరాన్ దేశం.. ఇరాన్ నాయకులు రష్యాకు నమ్మకమైన, విశ్వసనీయమైన దేశం, మిత్రులు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పటం అంటే.. ఇరాన్ దేశానికి ఆర్థికంగా, ఆయుధ పరంగా రష్యా వెన్నుదన్నుగా నిలుస్తుంది అనటానికి ఇదే సాక్ష్యం అంటూ ప్రపంచ దేశాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Source : V6 News

1 hour ago

Home Flash News