యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్‌కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్‌కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్‌కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు.
అయితే ఇరాన్‌కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్‌కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్‌కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్‌కు సహకరిస్తుందని అమెరికా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.