ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి : ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘ప్రజా సేవలో అంకితభావంతో పని చేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు.