ఐసీహెచ్ ఆర్(ICHR) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు..అప్లయ్ చేసుకోండిలా
చరిత్రపై పరిశోధన (Research) చేయాలనుకునే విద్యార్థులకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసీహెచ్‌ఆర్ (ICHR) గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. చరిత్రలో పీహెచ్‌డీ (PhD) చేస్తున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వడం ఈ ఫెలోషిప్ ప్రధాన ఉద్దేశం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 20న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.