... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Indian Railways: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

Indian Railways: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌కు తిరుగుతున్న ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యూలర్ సర్వీసులుగా మారుస్తు్న్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం విశాఖ నుంచి నాలుగు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌కు నడుపుతున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ కారణంగా వీటిని శాశ్వత ప్రాతిపదికన వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. విశాఖపట్నం-తిరుపతి(18505) రైలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతీ బుధవారం విశాఖలో రాత్రి 7 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుపతి-విశాఖపట్నం(18506) ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతీ గురువారం తిరుపతిలో రాత్రి 9.50 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

ఇక విశాఖపట్నం-చర్లపల్లి(18527) రైలు ఏప్రిల్ 3 నుంచి ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇక చర్లపల్లి-విశాఖపట్నం(18528) రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 5.20 గంటలకు విశాఖకు చేరుకుంటుంది

ఇక విశాఖ-బెంగళూరు(18509) ట్రైన్ ఏప్రిల్ 5 నుంచి ప్రతీ ఆదివారం విశాఖలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక బెంగళూరు-విశాఖ(18510) రైలు ప్రతీ సోమవారం బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

ఇక విశాఖ-బెంగళూరు(18509) ట్రైన్ ఏప్రిల్ 5 నుంచి ప్రతీ ఆదివారం విశాఖలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక బెంగళూరు-విశాఖ(18510) రైలు ప్రతీ సోమవారం బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

Source : TV9 Telugu

1 hour ago

Home Flash News