... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
రష్యా నుంచి గ్యాస్ కొంటాం అనుమతి ఇవ్వండి : అమెరికాతో భారత్ చర్చలు

రష్యా నుంచి గ్యాస్ కొంటాం అనుమతి ఇవ్వండి : అమెరికాతో భారత్ చర్చలు

ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా వైపు మొగ్గు చూపుతోంది. రష్యాకు చెందిన 'ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జీ 2' ప్రాజెక్టు నుండి LNG దిగుమతి చేసుకునేందుకు వీలుగా అమెరికా నుండి ప్రత్యేక మినహాయింపును కోరుతూ భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ ప్రాజెక్టుపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

భారత్ తన వాదనను అమెరికా ముందు బలంగా ఉంచుతోంది. ప్రపంచ ఇంధన భద్రత.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం దృష్ట్యా ఈ మినహాయింపు అవసరమని దౌత్యపరమైన చర్చల్లో స్పష్టం చేస్తోంది. ఒకవేళ అమెరికా ఈ విజ్ఞప్తిని అంగీకరిస్తే, గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గి, తక్కువ ధరకే గ్యాస్ లభ్యమవుతుంది. అయితే రష్యాపై ఆంక్షల విషయంలో కఠినంగా ఉన్న అమెరికా, భారత్ విజ్ఞప్తికి ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా సంబంధాలతో పాటు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపనుంది.

Source : V6 News

2 hours ago

Home Flash News