తెలంగాణకు మాత్రమే రేవంత్ సీఎం.. ఉత్తరాదికి కాదు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు అంటూ చురకలు అంటించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్‌లో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. కేసీఆర్‌తో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారు. రేవంత్, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు.
మొదట ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. కేంద్రం ఏం ఇస్తున్నాదో.. ఏం చేస్తుందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.