ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్‌లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్‌లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
కడప టీడీపీలో జోష్ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టుడుగు స్థానానికి వచ్చిందని గతంలో సీనియర్ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టేసిందని ఆరోపించారు. దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచీ టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు.
సాక్షాత్తు టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకొండారెడ్డిపై ప్రత్యక్ష దాడి చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వారు ఓ డివిజన్ టీడీపీ ఇంఛార్జి వెంకటేషపై మూకుమ్మడి దాడి చేశారు. కీలక నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనం అంటూ పాత తరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఎమ్మెల్యే కోవర్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో..పాత తరం వారే కోవర్టులని సర్దిచెప్పుకుంటుంటే...పాత తరం వారు మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కోవర్టులంటూ చెప్పుకొస్తున్నారు.