ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లు పంపిణీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.
ఇల్లు లేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రెండో విడత ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది. గతేడాది మూడు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో రెండున్నర లక్షల ఇళ్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు చేసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. స్టేట్‌వైడ్‌గా ఒకేసారి రెండున్నర లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఇందులో.. లక్ష టిడ్కో హౌసెస్.. లక్షన్నర ఇతర ఇళ్లు ఉన్నాయి.
సూళ్లూరుపేట నియోజకవర్గం.. నాయుడుపేట మండలం పుదూరు గ్రామం వేదికగా లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందజేస్తారు సీఎం చంద్రబాబు. టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల తర్వాత.. లబ్ధిదారులతో ఆయన మాట్టాడనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొంటారు సీఎం చంద్రాబాబు. మధ్యాహ్నం రెండున్నర తర్వాత సూళ్లూరుపేట టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక సాయంత్రం తిరుపతి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. P4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు.
ఇదిలా ఉండగా 2026 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలన్నింటినీ 100 శాతం పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. షేర్ వాల్ టెక్నాలజీతో భూకంపాలను తట్టుకునేలా, మౌలిక వసతులతో ఇళ్లను సిద్ధం చేస్తున్నారు.