... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ల దందా..ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. 400 సిలిండర్లు సీజ్

హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ల దందా..ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. 400 సిలిండర్లు సీజ్

హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న భారీ ముఠాను గుట్టును రట్టు చేశారు. ఒక సిండికేట్‌గా ఏర్పడి, నిబంధనలను తుంగలో తొక్కి సాగిస్తున్న ఈ చీకటి వ్యాపారంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

అఫ్జల్ గంజ్ ప్రాంతానికి చెందిన మెట్రో హెచ్‌పీ (HP) గ్యాస్ డీలర్ అమీర్ ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను ఏకంగా 6 వేల రూపాయలకు పైగా ధర పలికిస్తూ.. హోటళ్లు, రెస్టారెంట్లకు అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ ముఠా గత కొంతకాలంగా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. సుమారు 400 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక్కోటి 19 కేజీల బరువున్న సిలిండర్లు ఉన్నాయి. ఈ దందాలో ప్రధాన సూత్రధారి డీలర్ అమీర్‌తో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Source : TV9 Telugu

1 hour ago

Home Flash News