కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది.
కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్‌రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు.