KCR | నేటి ప్రజా పోరాటాలకు స్ఫూర్తి.. దొడ్డి కొమురయ్య: కేసీఆర్
KCR | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి ఆర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య గారి అమరత్వం, నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటలకు స్పూర్తిగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి, అనంతరం పదేండ్లపాటు బాలారిష్టాలను అధిగమించి, స్వయం పాలనను దేశానికే ఆదర్శంగా నిలబెట్టుకోవడంలో అమరుల త్యాగాల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ అన్నారు. తమ ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం, రాజకీయ హక్కుల కోసం తెలంగాణ సబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి, రాజ్యాంగ పరమైన హక్కులను అందించగలిగిన నాడే, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో తెలంగాణ అమరులు, త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ పర్యాటకం