... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
అమెరికా ఆర్మీ తాత్కాలిక చీఫ్‌గా క్రిస్టోఫ‌ర్ లానీవ్ !

General Christopher LaNeve: అమెరికా ఆర్మీ తాత్కాలిక చీఫ్‌గా క్రిస్టోఫ‌ర్ లానీవ్ !

General Christopher LaNeve: అమెరికా ఆర్మీ తాత్కాలిక చీఫ్‌గా జ‌న‌ర‌ల్ క్రిస్టోఫ‌ర్ లానీవ్ బాధ్య‌త‌లు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌స్తుతం పెంట‌గాన్‌లో భారీ మార్పులు జ‌రుగుతున్నాయి. ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్‌ను ఆ ప‌ద‌వి నుంచి ర‌క్ష‌ణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ త‌ప్పించారు.  న్యూయార్క్‌: అమెరికా ఆర్మీ తాత్కాలిక చీఫ్‌గా జ‌న‌ర‌ల్ క్రిస్టోఫ‌ర్ లానీవ్(General Christopher LaNeve) బాధ్య‌త‌లు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.

 ప్ర‌స్తుతం పెంట‌గాన్‌లో భారీ మార్పులు జ‌రుగుతున్నాయి. ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్‌ను ప‌ద‌వి నుంచి ర‌క్ష‌ణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ త‌ప్పించారు. 2023 నుంచి ర్యాండీ ఆ ప‌ద‌విలో ఉన్నారు. అయితే గ‌త ఏడాది నుంచి పెంట‌గాన్‌లో అనేక కీల‌క పోస్టుల్లో హెగ్‌సెత్ మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ఆర్మీలో ఉన్న సీనియ‌ర్ పొజిష‌న్‌లో ఆ ఆఫీస‌ర్ నాలుగేళ్లు ప‌ని చేయాల్సి ఉంటుంది. కానీ పీట్ హెగ్‌సెత్ చాలా వేగంగా పావులు క‌దుపుతూ .. పెంట‌గాన్‌లో మార్పులు చేస్తున్నారు.ర్యాండీని త‌ప్పుకోవాల‌న్న నేప‌థ్యంలో ఆ బాధ్య‌త‌ల‌ను తాత్కాలికంగా క్రిస్టోఫ‌ర్ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అమెరికా మీడియా చెబుతోంది. లానీవ్ ప్ర‌స్తుతం ఆర్మీలో వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. ఆయ‌నపై హెగ్‌సేత్‌కు న‌మ్మ‌కం ఉన్న‌ట్లు పెంటగాన్ ప్ర‌తినిధి సీన్ పార్న‌ల్ తెలిపారు. ఇప్ప‌టికే సుమారు డ‌జ‌న్ మంది పెంటగాన్ సీనియ‌ర్ లీడ‌ర్ల‌ను ర‌క్ష‌ణ‌మంత్రి మార్చేశారు. దీని వ‌ల్ల లానీవ్ త‌క్కువ స‌మ‌యంలో సీనియ‌ర్ రోల్‌లోకి వ‌చ్చేశారు. 2026 ఫిబ్ర‌వ‌రిలో వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా లానీవ్ నియ‌మితుడ‌య్యారు. జేమ్స్ మింగుస్ స్థానంలో అత‌న్ని తీసుకున్నారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News