Harish Rao | బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం : మాజీ మంత్రి హరీష్‌రావు
మహబూబ్ నగర్ : బీసీలకు ( BCs ) ,కుర్వ, గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) ఆరోపించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య( Doddi Komaraiah ) జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో కొమురయ్య విగ్రహానికి మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ , లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు నివాళులు అర్పించారు.తెలంగాణ పర్యాటకం ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ బీసీలకు వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని కేవలం రూ. 7 కోట్ల మాత్రమే నిధులు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. శాసన సభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినట్టు వెల్లడించారు. యాదవులకు గోర్లు ఇస్తామని, నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు.
కనీసం మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదని చెప్పారు.
దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను కోరితే వెంటనే అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పచ్చబడాలని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హరీష్ రావు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు రాగా బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి రోజు నీళ్లు ఇచ్చామని వివరించారు.
రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేమని, సాగు నీరు అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేసామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. రాజకీయంగా బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు ఇస్తామని మోసం చేశారని తెలిపారు .విద్య,ఉద్యోగాల్లో కూడా రిసర్వేషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.