Select Location
All Locations
State
Region
City / District
రేవంత్‌ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

రేవంత్‌ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల ఆదాయం ఆధారంగా నియోజవర్గాల పునర్విభజన చేపట్టాలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రతిపాదన కాంగ్రెస్‌ అధికారిక విధానామా? అనే విషయంపై రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు.City & Local Guides ఓటు అందరికీ సమానంగా ఉండాలన్నదే రాజ్యాంగ స్ఫూర్తి అని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జీఎస్డీపీ ఆధారంగా సీట్లు కేటాయించాలనడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ను ప్రశ్నిస్తున్న రేవంత్‌రెడ్డి.. జీహెచ్‌ఎంసీని ఏ ప్రాతిపాదికన మూడు ముక్కలు చేశారో? చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Smacy News 2 days ago
Home Flash News