Select Location
All Locations
State
Region
City / District
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్ఫైర్..10 రోజుల కాల్పుల విరమణకు కుదిరిన ఒప్పందం

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్ఫైర్..10 రోజుల కాల్పుల విరమణకు కుదిరిన ఒప్పందం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులతో తాను జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయని తెలిపారు."ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నేను 9 యుద్ధాలను ఆపాను. ఇది నా 10వ విజయం" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు.అమెరికా కాలమానం ప్రకారం..గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. 

ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు 34 ఏండ్ల తర్వాత వాషింగ్టన్ డీసీలో ముఖాముఖి భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జరిపిన చర్చలు ఫలించాయి. చర్చల తదుపరి దశ కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌‌లను త్వరలోనే వైట్ హౌస్‌‌కు ఆహ్వానించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్‌‌తో నేరుగా చర్చలు జరపడం లెబనాన్ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పని హెజ్బుల్లా నేత హుస్సేన్ హజ్ హసన్ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి లెబనాన్ లొంగిపోతోందని ఆరోపించారు.


V6 News 2 days ago
Home Flash News