Select Location
All Locations
State
Region
City / District
Rahul Gandhi: మెజీషియ‌న్ ఆఫ్ బాలాకోట్‌.. డిమానిటైజేష‌న్‌.. సింధూర్: మోదీపై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

Rahul Gandhi: మెజీషియ‌న్ ఆఫ్ బాలాకోట్‌.. డిమానిటైజేష‌న్‌.. సింధూర్: మోదీపై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఓ ఇంద్ర‌జాల‌కుడితో పోల్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇవాళ లోక్‌స‌భ‌లో ఆయ‌న రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుల‌పై మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. బాలాకోట్‌ దాడులు.. డీమానిటైజేష‌న్‌.. ఆప‌రేష‌న్ సింధూర్ ఇంద్ర‌జాల‌కుడు మోదీ అని రాహుల్ విమ‌ర్శలు చేశారు. దీంతో బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. రాహ‌ల్ గాంధీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్య‌లు ఖండించ‌ద‌గ్గ‌వ‌ని ఆయ‌న అన్నారు.

రాహుల్ త‌న ప్ర‌సంగంలో ప‌దేప‌దే మెజీషియ‌న్ అన్న ప‌దాన్ని వాడారు. ప్ర‌ధాని మోదీని ఉద్దేశించేందుకు ఆయ‌న ఆ ప‌దాన్ని వాడారు. అయ‌తే స్పీక‌ర్ ఓం బిర్లా ఆయ‌నకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే మాట్లాడితే అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. దీంతో ఆ ప‌దాన్ని వాడ‌బోన‌ని రాహుల్ అన్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుతో మ‌హిళా సాధికార‌త సంబంధం లేని అంశ‌మ‌ని రాహుల్ అన్నారు. ఇది కేవ‌లం దేశ ఎన్నిక‌ల మ్యాప్‌ను మార్చే అంశ‌మ‌న్నారు. కుల గ‌ణ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్నారు. ద‌ళితులు, ఓబీసీల‌కు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్నారు.


Smacy News 1 hour ago
Home Flash News