బీజేపీవి కుటిల రాజకీయాలు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ కుటిల రాజకీయాల వల్ల దేశంలోని మహిళలకు రిజర్వేషన్లు దక్కడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సాధికారతపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. నేటి పరిణామాలతో తేలిపోయిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ అంశంతో ముడిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎలాంటి సమస్య వచ్చేది కాదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆడిన నాట కాన్ని దేశ ప్రజలు కళ్లారా.. చూశారని, కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం ఆడిన డ్రామాలు మాత్రమేనని కేటీఆర్ మండిపడ్డారు.