Select Location
All Locations
State
Region
City / District
రివ్యూ: భూత్‌ బంగ్లా.. అక్షయ్‌ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ భయపెట్టిందా?

రివ్యూ: భూత్‌ బంగ్లా.. అక్షయ్‌ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ భయపెట్టిందా?

Bhooth Bangla Review || చిత్రం: భూత్‌ బంగ్లా; నటీనటులు: అక్షయ్‌ కుమార్‌, పరేశ్‌ రావల్‌, జిషు సేన్‌ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్‌, టబు, వామికా గబ్బి, మనోజ్‌ జోషి తదితరులు; నిర్మాత: అక్షయ్‌కుమార్‌, శోభా కపూర్‌, ఏక్తాకపూర్; దర్శకత్వం: ప్రియదర్శన్‌; విడుదల: 17-04-2026 ప్రేక్షకులను అలరించడంలో హారర్‌ కామెడీ సినిమాలది ప్రత్యేక స్థానం. ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో అలరించే అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడు ఆ జానర్‌ బాటపట్టారు. వినోదాత్మక చిత్రాలను రూపొందించే ప్రియదర్శన్‌తో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ‘భూత్‌ బంగ్లా’. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?

మంగళ్‌పూర్‌లో ఏ వివాహం జరిగినా వధువులు కనిపించకుండా పోతారు. గుర్తు తెలియని ఆకారం వచ్చి, కనిపించిన వారిని వేటాడి వధువుల్ని తీసుకెళ్లిపోతుంటుంది. దీంతో ఆ ఊళ్లో పెళ్లి వేడుక అనేది జరగదు. తండ్రి వాసుదేవ్‌ ఆచార్య (జిషు సేన్‌ గుప్తా), సోదరి మీరా (మిథిలా పాల్కర్‌)లతో కలిసి లండన్‌లో నివసిస్తుంటాడు అర్జున్‌ ఆచార్య (అక్షయ్‌ కుమార్‌). సోదరి మీరా పెళ్లి ఇండియాలో చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తాత దుష్యంత్‌ ఆచార్య (రాజేశ్‌ శర్మ) చనిపోవడంతో మంగళ్‌పూర్‌లోని పురాతన మహల్‌లోనే సోదరి వివాహాన్ని చేయాలని నిర్ణయించుకుని భారత్‌కు వస్తాడు. 

మహల్‌ను శుభ్రం చేయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా, గుర్తు తెలియని ఓ ఆకారం ఇంట్లో తిరుగుతున్నట్లు గుర్తిస్తాడు. తండ్రికి విషయం చెప్పడంతో అతడి సూచన మేరకు గురూజీ వశిష్ఠ (జకీర్‌ హుస్సేన్‌)ను అర్జున్‌ కలుస్తాడు. ఆ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ శక్తి ఏంటి? మంగళ్‌పూర్‌లో వివాహాలు జరగకపోవడానికి కారణం ఎవరు? అర్జున్‌ ఉంటున్న మహల్‌కు ఊరి చివరిన వధాసుర్‌ గుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ అడ్డంకులు అన్నీ దాటుకుని అర్జున్‌ తన సోదరి పెళ్లి చేశాడా? లేదా? అన్నది చిత్ర కథ.


Eenadu Telugu 1 hour ago
Home Flash News