Select Location
All Locations
State
Region
City / District
ఆసీస్‌ను అడగక్కర్లేదు.. గ్రీన్ బౌలింగ్‌ చేయకపోవడానికి కారణమదే: రహానే

ఆసీస్‌ను అడగక్కర్లేదు.. గ్రీన్ బౌలింగ్‌ చేయకపోవడానికి కారణమదే: రహానే

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బ్యాటర్‌గా ఫామ్‌లోకి వచ్చాడు. కానీ, అతడు ఇంకా పూర్తిస్థాయిలో బంతిని అందుకోలేదు. గత మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసినా.. భారీగా పరుగులు సమర్పించాడు. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఈ కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ భారీ హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, బౌలింగ్‌ మాత్రం చేయలేదు. దీనికి కారణమేంటని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు కేకేఆర్‌ కెప్టెన్ అజింక్య రహానే సమాధానం ఇచ్చాడు. గతంలో మాదిరిగా ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డును అడగక్కర్లేందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఇద్దరు.. 

ప్రతి బంతికీ వికెట్ తీసేలా కనిపించారు: శుభ్‌మన్‌ గిల్ ‘‘వరుస ఓటముల తర్వాత ఇలా మాట్లాడటం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌లోనూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయినా.. కామెరూన్ గ్రీన్‌ ఇన్నింగ్స్‌తో కోలుకోగలిగాం. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఎటాకింగ్‌ గేమ్ ఆడాడు. ఇక బౌలింగ్‌ విషయంలోనూ మెరుగ్గానే ఉన్నాం. చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ను తీసుకొచ్చారు. గుజరాత్ కెప్టెన్ గిల్ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. 180 పరుగులు బోర్డు మీదున్నప్పుడు పవర్‌ ప్లేలో వికెట్లు తీస్తేనే మ్యాచ్‌లో పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. సాయి సుదర్శన్ - గిల్ భాగస్వామ్యం మ్యాచ్‌ను దూరం చేసింది’’ అని రహానే తెలిపాడు. గత మూడు మ్యాచుల్లో..

‘‘గుజరాత్‌తో పోరులో మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. అయినా ఫలితం అనుకూలంగా రాలేదు. కామెరూన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్‌ చేయలేదనే అనుమానాలు రావడం సహజమే. దీని గురించి క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాల్సిన అవసరం లేదు (నవ్వుతూ). తిమ్మిర్లతో అతడు చాలా ఇబ్బందిపడ్డాడు. దీంతో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఫీల్డింగ్‌లోనూ ఎక్కువ సమయం లేడు. తదుపరి మ్యాచ్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆశిస్తున్నా. ఇక ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిపోయాం. గత మూడు మ్యాచుల్లో విజయానికి చేరువగా వచ్చాం. మేం అనుకున్నట్లు అన్నీ జరగవు కదా..’’ అని రహానే వెల్లడించాడు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News