ఒక్క గంటలోనే 7 సార్లు అబద్దాలు చెప్పిన ట్రంప్.. అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరాన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస ప్రకటనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్ ఒక్క గంటలోనే 7 అబద్ధాలు ఆడారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ సీరియస్ అయ్యారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలకూ.. ట్రంప్ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న మాటలకు అస్సలు సంబంధం లేదని తేల్చేశారు గాలిబాఫ్. ఇలాంటి అబద్ధాల వల్ల అటు యుద్ధంలో గానీ.. ఇటు చర్చల్లో గానీ ఎలాంటి విజయం లభించదని హెచ్చరించారు. ఇరాన్ వర్గాల సమాచారంతో పాటుగా అంతర్జాతీయ మీడియా విశ్లేషణల ప్రకారం ట్రంప్ చెప్పిన అబద్ధాలు ఇవే..
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంది: హోర్ముజ్ జలసంధి వ్యాపారం కోసం పూర్తిగా తెరవబడిందంటూ ట్రంప్ ప్రకటించారు. కానీ అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నందున అది తెరిచి లేదని.. తమ అనుమతి లేకుండా నౌకలు వెళ్లలేవని ఇరాన్ స్పష్టం చేసింది. అణు కార్యక్రమం నిలిపివేత: ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. దీనిని ఇరాన్ అధికారులు పూర్తిగా ఖండించారు.